హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా నవంబర్ 14 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమా హిందీ రీమేక్‌లో నటించడానికి బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తక్కువ ఖర్చుతో విమానాలను నడపాలనే తన కలను సాకారం చేసుకోవడానికి పోరాడిన ‘ఎయిర్ డెక్కన్’ యజమాని గోపీనాథ్ రియల్ స్టోరీ ఆధారంగా ఆకాశం నీ హద్దురా సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాను సుధ కొంగర డైరెక్ట్ చేశారు.


Also read : Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !


తాజా టాక్ ప్రకారం, ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈ ఆకాశం నీ హద్దురా సినిమా హిందీ రీమేక్ హక్కులను ( Aakasam Nee Haddu Ra Hindi remake rights ) కొనుగోలు చేయబోతోంది. ఈ రీమేక్‌కు సంబంధించి హీరో షాహిద్ కపూర్‌తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. షాహిద్ కపూర్ కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. షాహిద్ కపూర్ ( Shahid Kapoor ) ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రొడ్యూసర్స్ ఇతర పాత్రల నటీనటుల కోసం వేట ప్రారంభిస్తారు అని టాక్.


ప్రస్తుతం షాహిద్ కపూర్.. తెలుగులో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాద్ నటించిన స్పోర్ట్ బేస్డ్ మూవీ జెర్సీ సినిమా హిందీ రీమేక్‌లో ( Jersey hindi remake ) నటిస్తున్నాడు. గతంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్ మూవీలోనూ నటించిన సంగతి తెలిసిందే.


Also read : Jr Ntr with Atlee: తమిళ దర్శకుడితో తారక్ మూవీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి